Commentary

శిశువులనమ్మెడుయమ్మా? - భారతరత్నమ్మ తెరీసమ్మ! మదర్ తెరీసా మతవిధానం చేసిన దారుణం

మదర్ తెరీసా సంస్థ మిషనరీస్ అఫ్ చారిటీస్ పై కథనం

Sandeep Balakrishna, Translator: రామేశ్వరం జి

'మిషనరీస్ అఫ్ చారిటీస్' పేరుతో చలామణి అయ్యే జీవోద్ధరణ పేరుతో అవినీతి దుర్గంధాలమయమైన మురికి కాల్వ మరొక సారి కట్టలు త్రెంచుకున్నది . ఇది ఎన్నోసారో!! విశ్వవ్యాప్తంగా క్రైస్తవ సంస్థల దురాగతాలను పరిశీలిస్తున్న వారికి ఇది ఆశ్చర్యకరమైన విషయమేం కాదు. కాని విషయంబయట పడిన ప్రతిసారీ నాగుండె తూట్లు పడినట్లు రక్తం ఆవేశంతో ప్రవహిస్తూనే ఉన్నది. క్రొత్తగా బయటపడ్డ దారుణం.

మదర్ తెరీసా స్థాపించిన 'మిషనరీస్ అఫ్ చారిటీస్' లో శిశువులను అమ్మడం సర్వ సాధారణమైన విషయం. కాని 2014 నుండీ బలాత్కారంగా వసూళ్లు, శిశువుల దొంగ రవాణాలకు సంబంధించి అనేకానేక ఫిర్యాదులు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 'మిషనరీస్ అఫ్ చారిటీస్' రాంచిలోని కేంద్రాల ద్వారా శిశువుల రవాణా వ్యాపారం స్థానిక పోలీసుల సహకారంతో దిగ్విజయంగా నడుస్తున్నది'
మైనేషన్ న్యూస్ రిపోర్ట్

ఇప్పటికే నాకు గుర్తులేనన్ని సార్లు 'మదర్' తెరీసా భయంకర మత విధానాన్ని గురించి వ్రాశాను, మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకంటే ఇది క్రైస్తవ విశ్వాసాల వెనుక దాగిఉన్న అప్రకటిత ఆటవికత – క్రూరత్వం విషయములో ఒక నిరంతర అప్రమత్తతకు సూచనగా , హెచ్చరికగా ఉండాలనే సదుద్దేశ్యమే - క్రిస్టోఫర్ హిచెన్స్ మదర్ తెరీసా చేస్తున్న ఆకృత్యాలను బహిరంగ పరుస్తూ ' ది మిషనరీ పొజిషన్' అనే పుస్తకం వ్రాసాడు. నేనుగాని, క్రిస్టోఫర్ హిచెన్స్ గాని వ్రాయడానికి కారణం మదర్ ెరీసా కార్యకలాపాలను ఆకాశానికి ఎత్తివేస్తూ మాల్కం ముజరిజ్ వ్రాతలే. క్రిస్టోఫర్ హిచెన్స్ మాల్కం ముజరిజ్ ని - 'ఓల్డ్ ఫ్రాడ్ అండ్ మాంట్ బాంక్' అని ఎద్దేవా చేశాడు కూడా.

మూడు సంవత్సరాల క్రిందట, ఆరెస్సెస్ అధిపతి మోహన్ భాగవత్, ఆమె సేవ చేసే ఉద్దేశ్యము క్రైస్తవులుగా మార్చడానికేనని పేర్కొన్నారు. భాగవత్ గారు చెప్పినదాన్లో సత్యమున్నప్పటికీ , అందులో తెలియనితనము కూడా ఉన్నది. తెరీసా కార్యకలాపాలు ఏ విధంగా నిర్వచించినా సేవల కోవకు చెందినవి కావు - ఆమె తన జీవిత కాలాన్నంతా , 'పేదలనే పంట పండించడం ' కోసం, వ్యాధులను వ్యాధులతో క్షీణిస్తున్న వారిని ' జీసస్ తో ఏకీకృతం' చెయ్యడమనే కార్యానికే కట్టుబడి ఉన్నది.

శోధింపబడని జీవితం వ్యర్ధమనే సోక్రటీస్ ఆదర్శం ఒకటి ఉన్నది. ఆ ఆదర్శాన్ని నిజం చేసేందుకే క్రిస్టోఫర్ హిచెన్స్ తెరీసా ను దర్యాప్తు చేయడానికి మొదలుపెట్టాడనే అనుకుంటాను. కాని అది కొంత అతిశయోక్తి కావచ్చు. ఒకటి మాత్రం స్పష్టం - అప్పటి పరిస్థితులలో హిచెన్స్ చేసినది ఏటికి ఎదురీదడమే.

మీ "పరిశోధన"కోసంమదర్ తెరీసా - ఒక "పరిశుద్ధ వృద్ధ స్త్రీ "నే ఎందుకు"పట్టుకు"న్నారు, అన్నప్పుడు , ఆయన ఇలా అన్నారు:

ఆమె ప్రభావం విస్తృతంగా కనబడుతున్నదని కొంత , అంతే కాకుండా , ఆ ప్రభావాన్ని ప్రశ్నించరాదనే భావం అంతటా నాటుకొని ఉన్నది కనుక. ఇటువంటి అంధ విశ్వాసం పూర్తిగా వ్యతిరేకించదగినది - సహజంగా ఆలోచించే ప్రజలైనా ఏదైనా సరే ఒక పవిత్రతను ఆపాదించితే అదే ప్రజలు మూఢంగా నమ్ముతారనే విశ్వాసానికి - మదర్ తెరీసా, ఒకపరిశుద్ధ దేవదూత గా ఉదాహరణమని అనుకోవాలా ? మరోవిధంగా చెప్పాలంటే ఇది ఎన్ని రకాలుగా చూసినా , పరిశోధింపబడని ప్రతిపాదన. మరి పత్రికలు పరిశోధించాయా? ఆవిడ ఏం చేస్తున్నదో ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. మరి 'మూడవ ప్రపంచం' అని పిలువబడే అభివృద్ధి చెందని ప్రాంతాల్లో , ఎందఱో మహానుభావులు పీడిత ప్రజలకై నిస్స్వార్థ సేవలు అందిస్తుండగా, ఈమెను మాత్రమే దివిటీలు కట్టి మరీ చూపుతున్నారు , కారణమేమిటో?

కట్టు కథలు కల్పిత గాథలు నమ్మాలంటే సంశయ బుద్ధిని అణగ ద్రొక్కాల్సిందే. కాల్పనిక గాథలను గుర్తించిన వారు కూడా, ప్రజల్లో నానుకుపోయిన కట్టుకథలు , నిజమని నమ్మే స్థాయికి చేరుతారు. అందుచేత అవి నిజమేనేమో అనిపించుకుంటాయి. అందుకే వాటిని ప్రశ్నిస్తే దిగ్బ్రాంతి,అసహనము, దౌర్జన్యము తారస్థాయిలో ప్రకటితమౌతాయి.ఋజువులు దృగ్గోచరమౌతున్నా, అంధ విశ్వాసులు , సామాన్యులు, ఒక పట్టాన నమ్మరు, తిరస్కరించే సాహసం చెయ్యరు. వీటిని మానవ మేథస్సు జీర్ణించుకోవడమే కాకుండా, వాటిని రక్షించే లక్షణాన్ని , తమ ఎనిమిది వందల సంవత్సరాల అనుభవాన్ని రంగరించి క్రైస్తవ సంస్థలు నైపుణ్యంతోనూ, చాకచక్యంగానూ వినియోగించుకుంటున్నాయి.

ఈ కారణం చేత హిచెన్స్ 'బ్రద్దలు కొట్టిన' తెరీసా 'మదర్' గురించిన కల్పిత కథలను ప్రజాసామాన్యం ఈ దేశంలో చర్చించడం జరగలేదు. అలాగే పాశ్చాత్య దేశాలలో ఒక అస్పష్టమైన అవగాహన ఉన్నది – మదర్ ' తెరీసా ' ఒక క్రైస్తవ పరిశుద్ద స్త్రీ , బీదదేశాల్లోని బీదలకు, మరణావస్థలోనున్న రోగులకు సేవ చేసి సాంత్వన కలిగిస్తుంది. ఈ కారణం చేతనే డా. అరౌప్ చటర్జీ గారి పుస్తకం - 'మదర్ తెరీసా - ది ఫైనల్ వెర్దిక్ట్' బహుకాలంగా అలభ్యము.

అదే కారణంగా పాండిత్య ప్రతిభతో కూడిన పుస్తకం - "మదర్ తెరీసా - కమ్ బి మై లైట్ - ది ప్రైవేట్ రైటింగ్స్ అఫ్ ది 'సెయింట్ ఆఫ్ కలకటా'“ గురించి కూడా ప్రజలు విని ఉండరు. దాతృత్వము , సేవలు, పేదరికం, కష్టాలు, దేవుడు, సాధు సంతుల మీద నమ్మకాలు, దృఢమైన విశ్వాసాలు మొదలైన గంభీరమైన విషయాల్లో ఇతరుల అభిప్రాయాలు అనుకరించి తమవి చేసుకోవడం, స్వయంగా తర్కించి పరిశీలించడం కన్నా తేలికైన పని. అందుకని అదే చేస్తారు.

'బుద్ధులన్నీ వేరురా' అనే పెద్దమనుషుల స్థాయికి చెందిన ' నరక దేవత - తెరీసా' గురించి నేను వేరే వివరాలు ఇక్కడ ఉటంకించడం లేదు. అవి ఇప్పటికే విస్తృతంగా ప్రచురించబడి ఉన్నాయి. నరరూప రాక్షసులవంటి హైతి దేశ నియంత డువాలియర్ తో స్నేహ సంబంధాలుకావచ్చు ,లింకన్ సేవింగ్స్ అండ్ లోన్స్ నుండి భారీగా మోసం చేసి డబ్బు చేసుకున్న చార్లెస్ కీటింగ్ కావచ్చు, కలకత్తా లో ఆమె గృహంలో ' పరిచర్యల సౌకర్యాలు ' కావచ్చు గతించిన రాకుమారి డయానా విడాకులపై రెండు నాల్కల ధోరణి కావచ్చు - ఇలాంటివే ఎన్నో !

మదర్ తెరీసా సాధించిన ఏకైక ఘనత - భారతదేశంలో కొల్కాతా వంటి అతి దుర్గంధభూయిష్టమూ, అసహ్యకరమైన నగరం మరే ఇతర మూడవ ప్రపంచపు దేశాల్లో లేదని ప్రపంచానికి ప్రకటించడం - ఈ విషయం పాశ్చాత్య దేశాల్లో శాశ్వతంగా వాళ్ళ మనో ఫలకాలపై ముద్రించుకు పోయింది.

ఇది హిచెన్స్ తో ముఖాముఖి నుండి ప్రకటిస్తున్న ఒక భాగం. మీరు భారతీయులైతే బాధ పడకుండా ఉండలేరు.

గమనిక : నొక్కిచెప్పడం కోసంఅక్షర పరిమాణం మార్చి చూపాను.

ప్రశ్న : మదర్ తెరీసా కట్టు కథల్లో భారతదేశ ప్రజలు బాధితులు గా చూపించడం జరిగింది. ఆమెను గురించి భారతీయుల అభిప్రాయం ఏమిటి ?భారతదేశానికి ఎటువంటి స్వరూపాన్ని ఆమె కల్పిస్తున్నది ?

హిచెన్స్ : భారతదేశం నుంచే నా పుస్తకం ప్రచురితమైనందున అక్కడిసమాచారం నా వద్ద గుట్టలు గుట్టలు గా ఉన్నది.సమీక్షలు కూడా అనుకూలంగానేకొల్లలు గా వెలువడ్డాయి ….. ఎందఱో భారతీయులు తమ సాంఘిక రూపురేఖలనువికృతీకరించినందుకు ఆక్షేపించారు. మదర్ తెరీసాగానిఆమె అభిమానులకు గాని - వారి దృష్టిలో కలకత్తాలోజడత్వము, అసహ్యము , పేదరికము తప్ప వేరే ఏవీ లేవు. కళ్ళమీద వాలుతున్న ఈగలను తోలుకోనేందుకు కూడా శక్తిలేక అడుక్కుతినేవాళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలంటే ఎంతో ఆసక్తి దాయకమైన , వీరోచితమైన , సంస్కృతీపరంగా ఉన్నతస్థాయికి చెందిన నగరం - విశ్వవిద్యాలయాలు, రంగస్థలాలు, పుస్తకవిక్రయశాలలు, సాహిత్యగోష్టీ కేంద్రాలు …… బీదరికం కూడా తీవ్రంగానే ఉన్నది అయినప్పటికీ భిక్షగాళ్ళు అంత ఎక్కువగా ఉన్నట్టు తోచదు.వాళ్లైనా చొక్కాలు పట్టుకుని అడుక్కునేవాళ్ళు కాదు , గౌరవ మర్యాదలు పాటించే వాళ్ళేకలకత్తా కష్టాలకుమూలకారణం మితిమీరిన జనాభా, క్రైస్తవ సంస్థలు దాన్ని సమస్యగా పరిగణించడం లేదు.

బీదరికాన్ని తగ్గించడానికి తెరీసా కృషి చేస్తున్నారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఆమెకు బీద ప్రజలు కావాలి , చనిపోవడానికి సిద్దంగా ఉన్నవాళ్ళు కావాలి. వాళ్ళు బీదవాళ్లై, ఆకలితో అలమటించే వాళ్ళైఉండాలి . ఇక ఆవిడ పంట పండినట్లే. దేవుడి దయనిండినట్లే. వాళ్ళ ఆత్మలను దేవుడివద్దకు పంపిన ఖాతాలో వేసినట్లే. వాళ్ళు ఏసు ప్రభువులో కలిసినట్లే. సన్నగా , సున్నితంగా కనబడే ఆమె ఆకారం వెనుక పవిత్రత అనే కాంతి ముసుగు లో దాచిన హింసా ప్రవృత్తి కనబడనీయని జీవన విధానం ఉన్నది.

ఆమె కలకత్తా ఇంటిలో జరిగే హృదయవిదారకమైన సన్నివేశాల వివరాలు, ప్రత్యక్షానుభవం వలన లభించిన వివరాలు చదవ వచ్చు. ఇవి జర్మన్ పత్రిక 'స్టెర్న్' లో ప్రచురించబడ్డాయి. తెరీసా తో పది సంవత్సరాలు పని చేసిన నన్ - సుసాన్ షీల్డ్స్ వాఙ్మూలం కూడా ఉన్నది. ఇది చదివితే మనకు కూడా కడుపులో త్రిప్పుతుంది.

ప్రభువునుచేర్చే క్రమంలో జరుగుతున్న కృషిలో జరుగుతున్న అమానుషము అనైతికమైన కార్యాల వెనుక వున్న కారణాలేమిటో తెలుసుకోవడానికి మళ్ళీ హిచెన్స్ వద్దకే వెళ్దాం -

ఆమె ముఖ్యోద్దేశం మతమార్పిడే నని , అందుకోసం ప్రతిఘాతక శక్తులతో భారతదేశము లోను, మరి ఎన్నో ఇతర దేశాల్లోనూ మమేకం అయ్యారనే విషయం ఎన్నడూ బయటకు రాలేదు. ఐరోపాలో విడాకులు రద్దుచేసే రాజ్యాంగ చర్యను ప్రతిపాదించిన ఒకే ఒక్క దేశం ఐర్లాండ్ ను ఆపడం కోసం పురాతనాచారవాదులు, తిరోగమన వాదులతో చేతులు కలిపింది.

ప్రపంచ క్రైస్తవ మతమార్పిడి పరిశ్రమ మతమార్పిడులు చేయడం కోసం ఎన్నో రకాల వ్యూహరచనలు చేస్తుందనేది లోకవిదితం. మతమార్పిడులు బలవంతంగానూ , మోసము ద్వారానూ , ప్రలోభం ద్వారానూ జరుగుతుంటాయి. కాని మతమార్పిడులను ఆశక్తులైనవారు, మరణమాసన్నమైనవారు ఎటువంటి వయస్సులో నున్నా ఎంపిక చేసి మతమార్పిడులు జరపటం అమానుషం , జుగుప్సాకరం.

కాని ఆమె ప్రజ్ఞా పాటవాలన్నీ అందులోనే ఉన్నాయి. అవే కోట్లాది డాలర్లను ఆమె బ్యాంకుఖాతాలోకి జమ అయ్యేట్లు చేస్తున్నాయి. ఆమె గృహంలో యాతన అనుభవిస్తున్న ఒక వ్యక్తితో చెప్పిన మాటలు ఆమె ఎటువంటి మనిషో మనకు తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి.

ఒక వ్యక్తి అనుభవించే అందమైన బహుమతి ఏదో తెలుసునా - క్రీస్తు అనుభవించిన యాతనను అనుభవించడం.

ఒకడు భరించలేని బాధతో పెద్దగా మూలుగుతున్నాడు. అతడితో అన్నమాట " నీవు ఇంతగా మూలుగుతున్నావంటే, ఏసు నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడని తెలుసుకో" , వెంటనే, “నీ యేసును నన్ను ముద్దు పెట్టుకోవద్దు అని చెప్పు అంటూ అరిచాడు.

బీదలకు సహాయమనే పేరుతో మితిమీరిన ఇటువంటి మతమౌఢ్యం వలన సమకూడిన విరాళాలు ప్రపంచవ్యాప్తంగా వాటికన్ బ్యాంకు తో సహా అన్ని దేశాల్లోను నిక్షిప్తం చెయ్యబడ్డాయి. అందులో చిన్నమెత్తుకూడా పేదలకోసం వినియోగించబడలేదు. అంతేకాదు తనకోసంగాని , శాఖోపశాఖలుగల తన మిషనరీ సంస్థలకు కూడా ఖర్చుపెట్టలేదు. 'మిషనరీస్ అఫ్ చారిటీ' కాథలిక్ క్రైస్తవ సంస్థల్లోకి అత్యంత విజయవంతంగా నడపబడుతున్న సంస్థ, అంతేకాకుండా ఇతర కాథలిక్ క్రైస్తవ సంస్థలకు అత్యధికంగా విరాళాలిచ్చే సంస్థ కూడా ఇదే. కాబట్టి ఎంతమాత్రం బీదలకు , మరణానికి చేరువై బాధ పడుతున్నవారికి ఈ సంస్థ సహాయం చేస్తున్నాదో అర్థంచేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం, పోగైన కోట్లాది విరాళాలకు ఎటువంటి లెక్కలూ లేవు!

ఆమె సెయింట్ కాదని కోకొల్లలుగా దృష్టాంతాలు ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రజలలో చొచ్చుకుపోయిన అంధవిశ్వాసం దాన్ని మాపలేకపోతున్నదని హిచెన్స్ అభిప్రాయపడ్డాడు.

అవగాహనలోపించిన అందాల పోటీల అతివల దగ్గర్నుంచి 'ప్రజారాజ్యా'న్ని పాతరేసిన చిరంజీవి వరకు 'భారతరత్న'మ్మ ను చేసిన భారత ప్రభుత్వం నుండి నోబెల్ పురస్కారం వరకూ మదర్ తెరీసా మతంపేరుతో గత శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా సాధించిన ఘన విజయం ఆమె మతవిధానం , అనగా దాని వెనుక ఉన్న ఘనమైన దోపిడి కూడా.

మరి అత్యాశ్చర్యకరమైన విషయం ఆమె మాటలకు ఉన్నదున్నట్లుగా చెప్పినా ఖాతరు చెయ్యని జనం ఉన్నారంటే వింతలో వింతే కదా ! ఆమె తన విధివిధానాల క్రూరత్వాన్ని బహిరంగంగా చెప్పినాకూడా మహా మహా వ్యాఖ్యాతలు , రచయితల దగ్గర్నుంచి సామాన్యునివరకు ఆమె విషయంలో కుండ బద్దలుకొట్టినట్లు చెప్పటానికి ఎందుకింత బిడియపడతారో ! మే 31,1983 నాటి ఇండియా టుడే పత్రికలో ఆమె ఇచ్చిన జవాబులు చూడండి:

ప్ర : ఒక క్రైస్తవ మత సంస్థ ప్రతినిధిగా మీరు బీదలలో క్రైస్తవులను ఇతరులను ఒకే విధంగా చూస్తారా ?

జ. చూడను , నా విశ్వాసం నాకున్నది.

ప్ర : చర్చి అనుచితమైన పనులు చేస్తుందా ?

జ. చేయదు , భగవంతుని ప్రక్కనే నిలిచి ఉన్నంతవరకు,

ప్ర :మదర్, మీరు మధ్యయుగాల్లో పుట్టారు అనుకుందాం , ఖగోళ శాస్త్ర విషయంలో గలీలియోపై ధర్మ విచారణ సభ జరుగుతున్నది, మీరు ఎవరి పక్షం వహిస్తారు - చర్చి పక్షమా - ఆధునిక ఖగోళ శాస్త్ర పక్షమా?

జ. నవ్వుతూ - చర్చి పక్షమే

అలాగే 1988 లో ఆమె స్టెర్న్ పత్రికలో ఇలా చెప్పారు. “…మేము ఇక్కడ పని చేయుటకు రాలేదు , మేము ఏసు కోసమే ఉన్నాము. మతమే మాకు సర్వస్వం. మేము సామాజిక కార్యకర్తలం కాదు, బోధకులం కాదు , వైద్యులం కాదు మేము - నన్ లము," ఆమె బహిరంగముగా గడిపే సామాన్యమైన జీవనము , బీదలతో కలిసి పనిచేయడాన్ని ఎంతో గొప్పగా ఊహించి ఆమెకు అసాధారణమైన స్థాయిని అంటగట్టకుండా మనం ఆమె మాటలను ఆమె పరంపరను ఎందుకు పరీక్షగా పరిశీలించము ?

అన్నింటికన్నా ముఖ్యంగా తెరీసా మానవ ప్రకృతిని లోతుగా అధ్యయనం చేసింది. ఒక హిచెన్స్ ఐనా లేదా అరౌప్ చటర్జీ ఐనా వాళ్ళు బట్టబయలు చేసిన వాస్తవాలు , ఆమె విధివిధానాల క్రూరత్వముతో ఏసుతో ఏకమవడమనే సాధనను కొనసాగించినా ఎటువంటి చలనాన్ని తీసుకోనిరాలేకపోయారు.

నేడు ఆ సంస్థ శిశువులను నిరాఘాటంగా అమ్ముకొనే సాహసం చేస్తున్నదంటే ఈ విషవృక్షమూలాలు చాల లోతుగాను విస్తృతంగానూ చాలాకాలం క్రితమే వ్యాపించాయని అనుకోవాలి.

భగవంతునికి అందమైన కానుకగా!

The Dharma Dispatch is now available on Telegram! For original and insightful narratives on Indian Culture and History, subscribe to us on Telegram.