Commentary

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది ఆలయ విధ్వంసం మాత్రమే కాదు, అది హిందువుల అణచివేత యొక్క వ్యాప్తి

చర్చి మిషనరీలని సాధనాలుగా ఉపయోగించే శక్తులచే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరుగుతన్నహిందువుల అణచివేతకు సంబంధించిన సంఘటనల యొక్క సమగ్ర విశ్లేషణ.

Team Dharma Dispatch

Read the Original Article

ఉపోద్ఘాతం: మూడు చరిత్రలు

మొదటి చరిత్ర: కనుమరుగవుతున్న ప్రోలయ వేమారెడ్డి ఘన స్మృతులు

గోవును భక్షించి ఆలయధ్వంసం చేసే అపరిశుభ్రమైన తురుష్కలను ఓడించి తరిమి కొట్టిన తర్వాత,శ్రీ మహా విష్ణువు పాదాల నుండి జన్మించిన మనం, దేశంలో ధర్మ పాలనను సగర్వంగా పునస్థాపించాము. వేదబ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేశాము ఎందుకంటే తద్వారా వారు మన పవిత్రమైన సనాతనశాస్త్రాలను మరియు శాసనాలను చిరకాలం కాపాడుతారని. అంతేకాక అనేక దేవాలయాలలో పూజలను పునరుద్ధరించాము.

ఉత్తరాదినుండి దండెత్తివచ్చిన వివిధ ముస్లిం కిరాతకులను చెండాడిన మనయొక్క ఉగ్ర ప్రోలయ వేమారెడ్డి సనాతన ధర్మం కాపాడిన ఒక సాటిలేని యోధుడు. ఆయన రాసిన పద్నాలుగో శతాబ్దపు శాసనం దక్షిణ భారతదేశం లోని హిందూరాజులందరికీ ఒక ఆదర్శము. రాతి, రాగి మరియు తాటి ఆకులపై వ్రాయబడిన వందలాది శాసనాలకూ ప్రోలయ వేమారెడ్డి శాసనాలకూ మధ్య తేడా ఉన్నా కూడా వాటిలో కొన్ని అందమైన కవితలు వివిధ ఛందస్సులతో కూర్చబడి ఉన్నాయి. వాటి పరమార్ధం హింసాత్మక అబ్రహమిజం యొక్క రాక్షస శక్తులకు వ్యతిరేకంగా, ధర్మం, పవిత్రతలను కాపాడటానికి క్షత్రియుల చేసే మహోత్సవం అని మనం చెప్పుకోవచ్చు.

దక్షిణ భారతదేశంలో హిందూ మతానికి పద్నాలుగో శతాబ్దం కీలకమైనది మరియు క్లిష్టమైనది. పొరుగున ఉన్న కన్నడ దేశంలో హోయసల సామ్రాజ్యం నపుంసక బానిస సేనానాయకుడు మాలిక్ కాఫుర్ చేత వరుస విధ్వంసకాండకు గురై అట్టుడుకుతున్నప్పుడు, ఆంధ్ర దేశం కాకతీయ పాలన అంతరించిపోయి అప్పటికే గందరగోళంలో పడింది.ప్రోలయ వేమారెడ్డి అకస్మాత్తుగా ఈ కల్లోలము నుండి బయటపడి ఢిల్లీ సుల్తాన్లకు ఎప్పటికీ కోలుకోని దెబ్బ కొట్టారు.

వేమారెడ్డి తన స్వీయ జీవితకాలంలోనే పుట్టుకొచ్చిన అద్భుతమైన విజయనగర సామ్రాజ్యానికన్నా ముందర వచ్చిన ఒక ప్రతిభావంతుడు. ఒక సాహసవంతమైన వ్యూహంతో అతను దక్షిణాన నెల్లూరు నుంచి పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించిన ప్రాంతంలోని హిందువులను సైనికపరంగా సంఘటితం చేసి రాజకీయంగా కూడా ఏకంచేశాడు. మొత్తం ఆంధ్ర తీరం తిరిగి హిందూకరింపచేయుటే కాక శతాబ్దాల వరకు ధర్మ రక్షణ కోసం విస్తారమైన కంచు కోటగా మార్చారు.

108 శివాలయాలను నిర్మించి, తురుష్కులు నాశనం చేసిన వందలాది పురాతన దేవాలయాలను పున పవిత్రం చేసిన వేమారెడ్డి ఒక గొప్ప దాత (పరోపకారి) కూడా. అతను శ్రీశైలం మరియు అహోబిలం వంటి గొప్ప పుణ్యక్షేత్రాలకు భూమి, డబ్బు మరియు వనరులను విశేషంగా విరాళం ఇచ్చారు, మరియు తన సామ్రాజ్యం అంతటా వేలాది అగ్రహారాలను స్థాపించారు. అతను పొందిన అత్యున్నత గౌరవప్రదమైన అప్రతిమ-భూదాన-పరశురాముడు అనే (అసమానమైన భూమి-దానం చేసిన పరశురాముడు) బిరుదు ఆయనకు మిక్కిలి సముచితమైనది.

అతను స్థాపించిన రెడ్డి సామ్రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం సనాతన ధర్మరక్షణ మరియు వృద్ధి. ఇది అతను 120 సంవత్సరములుగా చేసిన మహత్కార్యం మరియు సాటిలేని సేవ. తత్ఫలితంగా, ఉత్తర వైపు నుండి ఎలాంటి క్రూరమైన సుల్తానూ ఈ దిశగా చూడటానికి సాహసించలేదు. ఆవులు ఇప్పుడు నిర్భయంగా తిరిగాయి. బ్రాహ్మణుల సామూహిక వధ మరియు వారి పవిత్రమైన యజ్ఞోపవీతాలను తూకంవేయడం ద్వారా వారిపై చేసిన వికృత “విజయంగా ” భావించే క్రూరమైన తురుష్క అలవాటు అటు పిమ్మట సాగలేదు. మరింత ముఖ్యమైనది, ప్రోలయ వేమారెడ్డి స్థాపించిన హిందూ సామ్రాజ్యం హిందూ దేవాలయాలను రక్షించే ఒక పటిష్టమైన బురుజుగా నిలచింది - అంటే, దేవాలయాలు ఇకపై విచ్ఛిన్నం కావు మరియు దేవతా విగ్రహాలు ఇకపై పగులగొట్టబడవు .

కానీ ఈ రోజు, మనకు “రెడ్డి క్రైస్తవులు” అని పిలువబడు ఒక విచిత్రమైన తెగ అవతరించినది.

రెండవ చరిత్ర: జీర్ణావస్థలో ఉన్న పురాతన చాళుక్య దేవాలయం

సుమారు ఆరు సంవత్సరముల క్రితం రాయలసీమ ప్రాంతం వైపు బయలుదేరిన ఒక యాత్రలో మేము ప్రశస్తమైన మహానంది ఆలయాన్ని దర్శించాము తరువాత ఆ పరిసరాలలో ఉన్న ఇతర చిన్నపెద్ద దేవాలయాల సందర్శనకు కూడా వెళ్ళాము. ఆ ప్రాంతం మొత్తం, ప్రారంభ మరియు మధ్య- చాళుక్యుల ఆలయ నిర్మాణాలకు, వాస్తు శాస్త్రము మరియు శిల్పకళా వైభవాలకు నిలయం.

ఆనాటి ఒక అనుభవం నా స్మృతిలో ఇంకా స్పష్టంగా ఉండిపోయింది.

అది ఒక మామూలు విష్ణు ఆలయ దర్శనం. ఆ గుడి మైళ్లకొద్దీ పచ్చదనంతో చుట్టబడి ఉన్న ఒక కుగ్రామం శివార్లలో కనపడీ కనపడకుండా ఉన్న చిన్న ఆలయం.ఆలయం మూసిఉంది. కాంపౌండ్ లోపల కూర్చుని బీడీ కాలుస్తున్న గ్రామస్తుడు మాతో ఇలా అన్నాడు, “అయితే నిర్ణీత సమయాలు అంటూ ఏమీ లేవు, కానీ మీ లాంటి భక్తులు దూరమునుండి వచ్చి సందర్శించినప్పుడు అయ్యవారు ఆనందిస్తారు.కొంచెం వేచి ఉండండి.”

సుమారు పది నిమిషాల్లో ఆలయ అర్చకులయిన ఆ అయ్యవారు ముగ్గురు నలుగురు యువకులు, కొందరు బాలికలు మరియు వివిధ వయస్సులలో ఉన్న మహిళలతో కలిసి వచ్చారు.

పూజ పూర్తయిన తరువాత, స్థల-పురాణాన్ని (ఆలయ చరిత్రను) వివరించమని మేము అయ్య వారిని అడిగాము. ఆలయ చరిత్రపై ఆయనకు నిజంగా అద్భుతమైన మరియు సర్వజ్ఞానసంపన్నమైన పట్టుకలిగి ఉండి పురాణ శైలిలో పవిత్రముగా, శ్రావ్యముగా మరియు అత్యంత సంస్కృతీకరించబడిన తెలుగులో చక్కగా వివరించారు. అది అంత అవసరంలేదు కానీ ఆయన చెప్పిన చారిత్రక కాలక్రమరేఖలు వరుస తప్పాయి. దాన్నిమనం తప్పు పట్టలేము. ఆయన మాకు ఆలయం అంతా చూపించారు, ప్రతి శిల్పకళను మరియు బొమ్మలు చెక్కటం, ఓపికగా చూపిస్తూ చాళుక్యుల మరియు వివిధ విజయ నగర రాజుల వైభవాలని కీర్తించారు.ఆ ఆలయం ఒకప్పుడు అపారమైన పవిత్రతను కలిగి ఉందని మరియు వివిధ ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షించిందేదని స్పష్టమైంది.ఇలాంటి స్థితికి ఇప్పుడు ఎందుకు పడిపోయిందని నేను అయ్యవారిని అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు, “స్వామీ, ఎవరు పట్టించుకుంటారు? ధర్మం తన చివరికాలు మీద ఉంది. అధికారులు మరియు గుమస్తాలను నియమించడం ద్వారా భక్తిని చట్టపరం చేసి అమలు చేయగలదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అబ్బాయిలు, అమ్మాయిలు నాతో ఎందుకు వచ్చారో తెలుసా? మీరు ఈ గుడి గురించి తెలుసుకొని ప్రయాసపడి ఇక్కడకు వచ్చి ప్రయాణం సఫలం చేసుకొన్నారంటే అదే నిజమైన భక్తి. సాద్యమైనంతవరకు మాకున్న కొద్దిపాటి వనరులతో ఆలయాన్ని నడపటానికి ప్రయత్నిస్తాము. మేము ముఖ్యమైన ఉత్సవాలను మా శక్తి కొద్దీ జరుపుకోవడానికి ప్రయత్నిస్తాము. మాకు పురాతనమైన ఈ పవిత్ర ఆలయం తో ప్రగాడ అనుబంధం ఉంది దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలనుకుంటున్నాము.

మేము తెలుసుకొన్న విషయాల వలన కలిగిన విచారం కారణంగా మా కారులో సుమారు ఒక గంటసేపు నిశ్శబ్దం ఆవురించింది. ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేయడం ఇష్టంలేక ముందుకు సాగుతుండగా, ఒకప్పుడు సనాతన సంస్కృతి మరియు సమాజానికి సగర్వ నిలయమైన ఈ రాయలసీమ గడ్డ మీద రోడ్డు కు అన్నివైపుల ఉన్న ఒక విస్తృత దృశ్యం మమ్మల్ని పలకరించి చుట్టుముట్టింది - అది విస్తృతం గా వ్యాప్తి చెందిన చర్చి వ్యవస్థ. నేను అనుకున్నది ఒక ముక్క లో చెప్పాలంటే ఈ విషయం గమనించండి: నంద్యాల నుండి మహానంది వరకు మరల కర్నూలు నుండి శ్రీశైలం వరకుఉన్న మొత్తం ఈ భూభాగం ఎలా కనపడిందంటే ప్రతి చర్చీ మరియు శిలువ చే విజయ కేతనాలను ఎగరేసి జయించబడిన భూమిలాగా కనపడుతోంది. చాళుక్యులు మరియు రాయల పవిత్ర భూమి ఇప్పుడు క్రీస్తుకు ఎర అవుతున్న ప్రాంతం లాగ.

మూడవ చరిత్ర : మొండితోక సుధీర్ యొక్క చరిత్ర

2015-16 లో, నేను కొంత పరిశోధన చేస్తున్నప్పుడు, సుధీర్ మొండితోక అనే ఒక క్రిమి లాంటి మనిషిని తటస్థ పడటమయినది. ఒకప్పుడు హిందువు అయిన ఈ కొత్తగా బయలుదేరిన క్రైస్తవ పాస్టర్, ఇప్పుడు క్రీస్తు కు వీర సైనికుడు. ఇప్పుడున్న సనాతన సమాజం లో నెలకొన్న నాగరికత ఉదాసీనత పై ఉన్న అపార నమ్మకం తో, అతడు విదేశాలనుండి ఆత్మలను శుద్ధిచేసే ఒక తెల్లవారి బృందాన్ని మన పవిత్రమైన తిరుమల కొండల పర్యటన కు తీసుకొచ్చాడు. అప్పుడు హిందువులకు తిరుమలపై ఉన్న పవిత్ర భావం గురించి చెపుతూ తిరుమలను ఎలా స్వాధీనం చేసుకోవాలో అని వారికి ఖచ్చితమైన వివరాలను అందచేసాడు. అలా చేస్తే అది క్రైస్తవ మతానికి వారు చేసే గొప్ప సేవ అని కూడా అన్నాడు. అది భారతదేశం యొక్క వాటికన్ కూడా అయిపోవచ్చుట.

సుధీర్ అరెస్టు కావడం వేరే విషయం కావచ్చు, కానీ ఆ ప్రశ్న మాత్రం ఇంకా మిగిలి పోయింది. ఈ స్థాయిలో అతడికి అంత ధైర్యసాహసాలు ఎలా వచ్చాయి? మరింత ముఖ్యముగా, తిరుమలకు ప్రవేశ ద్వారం అయిన తిరుపతి పవిత్ర క్షేత్రం లో చర్చి లను నిర్మించటానికి ఎందుకు అనుమతించారు?

Pastor Sudhir Mondithoka Evangelising at Tirumala

అధ్యాయం 1: ఆంధ్రప్రదేశ్‌ యొక్క పతనం

అయన తప్పిదాలు ఎన్ని ఉన్నా, ఆంధ్రప్రదేశ్ (అవిభక్త) మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు గారికి రెండు పెద్ద విజయాలలో ఘనతను ఇవ్వొచ్చు. మొదటిది ఆయన బాహాటంగా తన అపూర్వమైన రీతిలో మోటైన. శాశ్వతమైన సనాతన సాంస్కృతిక మత ప్రతీకవాదము/సింబాలిజం మరియు తెలుగుతనాన్ని పునరుజ్జీవింపజేయడానికి వారు ఇచ్చిన పిలుపుల శక్తివంతమైన మేళవింపు ద్వారా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ను తిరిగి హిందూకరింపచేయటం. రెండవది ముస్లిం జనాభా ముప్పు నేపథ్యం లో ఆయన యొక్క తెగువతో కూడిన హెచ్చరిక - తమ జనాభాను నిర్భయంగా పెంచుకోవాలని హిందువులకు పిలుపునిచ్చుట.

ముఖ్యమంత్రిగా ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు ఈ రెండింటి నీ చెడగొట్టారు .

ఎన్. టి. రామారావు యొక్క ఈ విజయానికి, ఆకర్షణ కు నిజంగా ఉన్న ఇబ్బంది ఏమిటంటే అవి దూరదృష్టి లేకుండా స్వల్ప కాలికం అయ్యాయి. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నది కేవలం రెండు సంవత్సరాలు, అప్పటికే ఆయన తెలుగు దేశం పార్టీని కమ్మ వారి పార్టీగా పేరుపెట్టబడినది, ఆ ముద్ర బలమైన కారణాలవలన శాశ్వతంగా ఆ పార్టీకి అతుక్కు పోయింది. ఆ విధంగా, ఎన్.టి. రామారావు ఆంధ్రాలో కాంగ్రెస్ వెన్నెముకను నిశ్చితముగా విచ్ఛిన్నం చేయగా, ఈ కమ్మ ముద్ర రాష్ట్రంలో కుల విభజనలు మరింత బలపడటానికి దోహదపడింది. 1980 ల చివరలో మరియు 1990 ల మధ్యలో, ఈ విభజనలు బహిరంగ శత్రుత్వం మరియు చెదురుమదురు కులయుద్ధాలకు దారి తీసి హింస మరియు హత్యలకు దోహదపడ్డాయి . ఈ విభజనల మిశ్రమం లో, కొత్తగా ప్రబలమైన కాపులు తమ వాటాను కూడా డిమాండ్ చేయడం ప్రారంభించారు.

ఆలాగే, 2004 లో, వై.ఎస్. రాజశేఖరరెడ్డి (వైయస్ఆర్) అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్‌కు అద్భుతమైన విజయాన్నిసంపాదించినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని హిందూసమాజం తిరిగి ఐక్యమవటం ఎప్పటికీ అసాధ్యం అనేంతగా విచ్ఛిన్నమైంది.

రెండవతరం క్రైస్తవ మతాంతరితుడు అయిన వైయస్ఆర్, మన భారతదేశం చూసిన అత్యంత పరిపక్వమైన, కపటమైన మరియు కనికరము లేని రాజకీయ నాయకులలో ఒకరు. రాయలసీమ హత్యా రాజకీయాల్లో ప్రవేశించి అతను చేసిన మొదటి పని ఏమిటంటే, తన సొంత గడ్డలో తన పరిపాలన కు గల వ్యతిరేకతను తొలగించడం. లౌక్యం మాటకొస్తే, అతను టిడిపి కి గల సహాయక వ్యవస్థను క్రమపద్ధతి లో పీకనొక్కడం ప్రారంభించాడు: దీనికి పెద్ద ఉదాహరణ మీడియా ప్రముఖుడు రామోజీరావును పీడించడము. కపటం వరకు వస్తే, అతను తన రెడ్డి గుర్తింపును బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా క్రైస్తవుడిగా ఉన్న తన నిజమైన ఉనికి ని జాగ్రత్తగా దాచిపెట్టాడు.కానీ రెండూ చక్కగా పనిచేసాయి.

మిషనరీ సాధనానికి ఇది క్రీస్తు ఇచ్చిన నిజమైన బహుమతి. పదునైన సెగ్మెంటెడ్ మార్కెటింగ్ పద్దతితో మత మార్పిడులను దర్జాగా అమలుచేయటం మొదలైనది. ఇప్పుడు రెడ్డి సమాజం మొత్తం సనాతన సమాజం నుండి వేరు చేయబడి దుర్బలమైనది. అందువల్ల, పైన పేర్కొన్న “రెడ్డి క్రైస్తవులు” యొక్క సంఖ్య పెరగ డానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈ సత్యాన్ని వివరించే నిజ జీవిత డేటా పాయింట్ ఇక్కడే ఉంది. ఒక క్షణం ఆంధ్రాను ఒక పక్కన పెడదాం. ఇటీవల 2006-8 లో, బెంగుళూరు లోని భారీ షాపింగ్ మాల్స్, రెడ్డి క్రైస్తవుల కోసం సువార్త సంగీతం పేరుతో సీడీలు మరియు డీవీడీలు నిల్వ చేయడం ప్రారంభించాయి.

స్పెషల్ ఇంటరెస్ట్ గ్రూపులు (యస్.ఐ.జి) మరియు సంస్థలను ఏర్పరిచి, క్రైస్తవులకు స్కాలర్‌షిప్‌లు మరియు గ్రాంట్లు ఇవ్వడం ద్వారా వైయస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రోత్సాహాన్ని ప్రత్యేకంగా క్రైస్తవ మతానికి ఎలా పెంపొందించారో అన్నది ఇప్పుడు అందరికి తెలిసిన కథే. ఇది మధ్యయుగ ముస్లిం పాలకుల పాతకాలపు వ్యూహాల పుస్తకం నుండి తీసుకోబడింది.

నిజమే, ఈ దాడి బహుముఖమయినది, కపటమైనది, మరియు హిందూ సమాజం నేరుగా గమనిస్తుండగా జరిగింది. వైయస్ఆర్ యొక్క అల్లుడు "బ్రదర్" అనిల్, తన ఘోరమైన హయాంలో హిందువుల మతమార్పిడి వినాశనానికి అడ్డుఅదుపులేకుండా భారీగా రంగంలోకి దిగాడు. దక్షిణ భారతదేశం లో శాస్త్రీయమైన హిందూ మతం అనే అద్భుతమైన కోట వేగంగా కొల్లగట్టబడి, దెయ్యాన్ని ఆరాధించే మతాచారంచే నిర్దాక్షిణ్యం గా చుట్టుముట్టబడింది.

ఆ తరువాత, వైయస్ఆర్ ప్రభుత్వం మరో చెడ్డ పద్ధతిలో రక్తాన్ని తాగుతూ వచ్చింది. వారు గోదావరి ప్రాంతం లో వేలాది ఎకరాల ఆలయ భూములను సిగ్గు లేకుండా వేలంవేశారు . భారీ ప్రజాగ్రహం తరువాత అది పాక్షికం గా ఆగిపోయింది. అయితే, ఈ రోజు వరకు, ఈ భూములు హిందూ మతాలావారికి తిరిగి ఇచ్చారో లేదో ఎవరికీ తెలియదు.

ఏదేమైనా, పవిత్రమైన తిరుమల కొండ పైన చర్చిలను నిర్మించాలనే ప్రతిపాదన అత్యంత ఘోరమైన ప్రయత్నం. మరో సారి, హిందూ ఎదురు దెబ్బ దాన్ని రద్దు అయ్యేలా చేసింది .

మరింత నష్టం కలిగించక ముందే వైయస్ఆర్ మరణించాడు, కాని అతను వేసిన పునాదులు ఈ రోజు తన కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి మంచి ఫలాలను అందిస్తున్నాయి.

అధ్యాయం 2 : భారతీయ యూనియన్‌లో ఒక క్రిస్టియన్ రాష్ట్రము

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఇండియన్ యూనియన్ లోని క్రైస్తవ రాష్ట్రం. ఇది భక్తితో కూడిన ఒక క్రైస్తవునిచే ఏల బడుతున్నది. ప్రభుత్వంలో ఉన్న అతని సన్నిహితులు క్రైస్తవులు, మరియు చర్చి-మిషనరీ అనే ఉపకరణం, తమ అదృశ్య హస్తాన్ని వేశేషముగా విస్తరింపచేస్తున్నాయి.

ఇప్పుడు కొనసాగుతున్న హింస ఒకానొక పద్ధతి మాత్రమే. వాస్తవానికి, ఈ విధ్వంసాలు నిజానికి పేరుకి మాత్రమే. అవి ముఖ్య చిత్రం కానే కాదు, అది “స్వచ్ఛమైన” క్రైస్తవ రాజ్యం లో హిందువులకు ముందు ముందు ఏమి జరుగుతుందో చెప్పడానికి వేసిన ట్రైలర్ మాత్రమే . ఇది ఒకసారి ఆలోచించండి. ఈశాన్య రాజకీయ నాయకులు బిజెపిలో చేరినప్పుడు, వారు బైబిల్ మీద ప్రమాణం చేశారు.

2016 లో, నేను ఒక అనధికారిక సర్వేను ప్రారంభించాను. దాని ఫలితాలు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతం లో ముప్పై శాతం హిందువులను క్రైస్తవ మతం లోకి మార్చాయని తేలింది . ఈ సంఖ్యలో వారి హిందూ పేర్లను పూర్వంలాగే ఉంచుకున్న క్రైస్తవులు లేరు. ఈ సంఖ్య ఇప్పుడు ఏ కారణం గా పెరిగిందో ఊహించుకోవచ్చు.అంటే మనం భయంపడిందంతా జరుగుతోంది ఇప్పుడు.

ఇంత వేగంగానూ, తఱుచుగానూ, యథేచ్ఛగానూ దేవుళ్ళ విగ్రహాలమీద దాడులు, అదీ సంఘటితంగా మరియు ఏకకాలం లో జరుగుతన్న తీరు చూస్తుంటే అవి కొన్ని ఖచ్చితమైన అనుమాలకి దారి తీస్తున్నాయి:

1. భయపడే సంఖ్యలో ఇప్పటికే చాలామంది హిందువులు మతం మార్చబడ్డారు.

2. క్రైస్తవ మతంలోకి మారబడిన వారందరినీ నిశ్చింతగా, నిర్దయగా వారి పూర్వ మత సహోదరులకు వ్యతిరేకంగా ఆయుధాలుగా వాడుకుంటున్నారు .

3. జగన్ యొక్క రక్షిత, రాజకీయ క్రైస్తవ పిడికిలి పై విశ్వాసం ఉన్నందున చర్చి యంత్రాంగం తన పూర్తి శక్తిని బహిరంగంగా చూపిస్తోంది .

4. భారతదేశ సార్వభౌమ సమగ్ర ఐక్యత కు గల సాంస్కృతిక మరియు రాజ్యాంగ పునాదులకు చర్చి యంత్రాంగం విసిరిన బహిరంగ సవాలు.

ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఇప్పుడు సమస్య ప్రజలు “మంచి” మతం లోకి ఆరోగ్యం సంరక్షణ లేదా విద్య గురించి మారడం కాదు. అన్నింటికీ మించి ఇది ఒక మత శాస్త్ర విజయం గురించిన విషయం. నిజమే, క్రైస్తవ మత సిద్ధాంతం క్రైస్తవ మతం లో అంతర్లీనం గా ఉన్న సామ్రాజ్యవాదాన్ని కప్పి ఉంచే ముసుగు అని రామ్ స్వరూప్ మరియు సీతారామ్ గోయెల్ మరియు అరుణ్ షౌరీ రాసినప్పుడు, వారి అర్థం ముమ్మాటికీ అదే. అవును, నిజమే. క్రైస్తవ మతం యొక్క సుదీర్ఘ చరిత్ర చూపినట్లుగా, తత్వ జ్ఞానం అనేది రాజకీయ విజయానికి చివరిగా వచ్చే ఖచ్చితమైన రక్తపాత యుద్ధాన్ని ముందే సూచించే మోసపూరిత ముందుమాట. ఆంధ్రా లో ఇదే జరుగుతోంది: రాజకీయ శక్తిని నగ్నంగా మరియు బహిరంగగా ఒడిసిపట్టుకుని ఏకీకృతం చేయడం.

Y.S. Jaganmohan Reddy

జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన మెజారిటీ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు, నేను బాగా గౌరవిస్తున్న ఒక వృద్ధ పండితుడు తెలుగులో కేవలం మూడే మూడు మాటలు అన్నారు.: ఆంధ్ర సర్వ నాశనము అయ్యింది.

చరిత్రను అధ్యయనం చేసినవారు జగన్ రెడ్డి రోమన్ చక్రవర్తి కాన్స్టాంటిన్ (Constantine)​తో ఎక్కువ పోలి ఉన్నాడని ధృవీకరిస్తారు, కానీ కాన్స్టాంటిన్ లా కాకుండా, ఇతడు ఇంకా ఎక్కువ ఆరోగ్యంతోనూ, ఎక్కువ ఆకలిగొన్నవాడిలా, భగవంతుని కోసం తెగ ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తాడు. క్రైస్తవ మతాన్ని క్రైస్తవ మతేతర రోమ్ యొక్క రాష్ట్ర మతంగా ప్రకటించినప్పుడు, కాన్స్టాంటిన్ ప్రజలమీద కు వదిలి పెట్టిన సవివరమైన క్రూరమైన వృత్తాంతం కోసం, ఈ భీతిగొల్పు వ్యాసాన్ని మీరు చదవండి.

ఇంకా చెప్పాలంటే, ఆంధ్రాలో హిందూ సమాజంపై జరుగుతున్న క్రైస్తవ దాడులకు పూర్తిగా రాజకీయ కోణం కూడా ఉంది. జగన్ రెడ్డి లో ఉన్న రాజకీయ వేత్తకు తెలుసు బలీయమైన ఎన్నికల జగన్నాధుడు అనే బిజెపి ని ఒంటరిగా ఎదుర్కోవడం ఒక కష్ట సాధ్యమైన పని అని కూడా చెప్పొచ్చు. బహుశా ఆయనకు ఇంకోటి కూడా తెలుసు: బిజెపి ఆంధ్రాని లాక్కుంటే తన దారి మూసుకుపోతుందని. కాబట్టీ, అతని ముందు ఒకటే ఆప్షను ఉంది. అదే, తాను ఎంత ఎక్కువమంది హిందువుల ఆత్మల యొక్క పంటను ఇప్పుడే కోసుకోగలిగితే తనకు అంత మంచిది, తద్వారా, 2024 కల్లా అతను తన ఏకైక గుత్తాధిపత్యం గా నిలిచే గణనీయమైన, రెడీమేడ్ క్రిస్టియన్ ఓటు బ్యాంకు ను తయారుచేసుకోవడం.

అధ్యాయం 3: మూడు స్థాయిలలో విధ్వంసం

హిందూ పేర్లతో ఉన్న ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగా కాకుండా, అంటే వారి హిందుత్వాన్నికూడా దూషించుకునేలా, మరియు "మైనారిటీలను" రక్షించడానికి తాము అసాధారణంగా కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చేలా కాకుండా, జగన్ తన క్రైస్తవ మతాన్ని తన భుజం మీద ఒక కండువాలాగా బహిరంగంగా వేసుకుంటాడు.

ఇది మనం మైనారిటీ అనే సిద్ధాంతన్నీ ఎలా పరిగణిస్తాము అనేదాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. మిషనరీలు ఆంధ్రాలోని హిందూ గ్రామాల ను మొత్తంగా క్రైస్తవ మతం లోకి మార్చి నప్పుడు, వారు aప్పటికీ మైనారిటీలుగానే ఉంటారా? ఆ గ్రామాల్లోని దేవాలయాలు మరియు మఠాలు, ఇతర సనాతన సంస్థలూ ఏమవుతాయి?

ఈ పరిణామాన్ని స్వామి వివేకానంద వంటి సాధువులు, జ్ఞానులు , ఆలోచనాపరులు ఖచ్చితంగా ముందే ఊహించారు. నిజమే, పి.వి. కేన్ మరియు డి.వి. గుండప్ప అనే నిష్ణాతులు భరత వర్షము వంటి లోతైన ధార్మిక మరియు నాగరిక రాజ్యం లో లౌకిక ప్రజాస్వామ్యం అనే పరాయిదైన పాపిష్ఠి మరియు మూర్ఖమైన వ్యవస్థ ను అవలంబించడము వల్ల కలిగే అనౌచిత్యం మరియు ప్రారబ్ధం అనే రెండింటి గురించి పదేపదే హెచ్చరించారు. ఏడు దశాబ్దాల పిదప దాని పర్యవసానం నిస్సందేహంగా ఒకటి అనిపిస్తోంది : 1950 లో అటువంటి సంస్కారమైన రాజ్యంపై తొలుత గా పరీక్షించని ప్రజాస్వామ్యాన్ని మనమీద విధించుకున్న అత్యంత విపరీత హిందూ బాధితులముగా మిగిలిపోయాము.

ఇదే ఏడు దశాబ్దాలు మరో రోజువారీ సత్యాన్నివెల్లడించాయి. అదేమిటంటే హిందూసమాజం రెండు ప్రధానరీతులలో తనకు తానే మింగేసుకుంది:


1. తెలివిలేని మరియు రాజకీయంగా ప్రేరేపించబడిన కుల వైరుధ్యం కొంత వరకు తగ్గినప్పటికీ , పరస్పర అనుమానం మరియు అవిశ్వాసం ఇంకా మిగిలే ఉన్నాయి.

2. నేటి క్రైస్తవ మతాంతరితులు, గతంలో లేని రీతిలో, తమ పూర్వ మతానికి వ్యతిరేకంగా సాటిలేని ఉత్సాహం తో, క్రూరత్వం తో, మరియు తక్షణ బాంధవ్యంతో ఎదుగు తిరుగుతున్నారు. జగన్ పాలిత ఆంధ్ర రాష్ట్రం ఒక తాజా యుద్ధభూమి.

ప్రస్తుతం ఆంధ్రాలో కొనసాగుతున్న పరిస్థితి ప్రకారం, క్రైస్తవ రాజకీయ ఉపకరణం మూడు ప్రధాన స్థాయిల్లో పని చేస్తుంది .

రాజకీయ స్థాయి : రాజకీయ అధికారాన్ని ఉపయోగించి, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా, భారీ స్థాయిలో హిందువుల మత మార్పిడి చేయడం. ఈ నీచమైన ప్రయత్నంకు గల సమీప లక్షణము ఏమిటంటే హైందవం గా కనిపడే దేన్నైనా హింసతో కూడిన వేధింపులకు గురి చేయడం.

సాంఘిక స్థాయి: ఇంచుమించుగా మొత్తం విచ్ఛిన్నం అయినా, అప్పటికే విడిపోయిన హిందూ సమాజాన్ని, అట్లాగే దాన్నీ మరింత దిక్కు తోచని అంచులవరకు ఇంకా నెట్టేస్తూ, రాబందులు కేవలం అస్థిపంజరాలను మాత్రం చివరకు వదిలేంతగా కృశింప చేస్తూ ఉండడం. ఇది కూడా ఆలోచించండి. ప్రస్తుతానికి, రెడ్డి సమాజం, “రెడ్డి క్రిస్టియన్” జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రధాన మరియు అత్యంత శక్తివంతమైన మద్దతు పీఠము ఏర్పరోస్తుంది. "రెడ్డి క్రైస్తవులు" మెజారిటీ అయినప్పుడు, మైనారిటీ "రెడ్డి హిందువులు" మతం మారడానికి నిరాకరించినప్పుడు ఏమి జరుగుతుంది?

వ్యక్తి స్థాయి: ముఖ్యంగా ఆంధ్రాలో మతమార్పిడులు, మనం చూసినతవరకూ, మతాలు, దేవుడు, ఆరోగ్య సంరక్షణ లేదా విద్య గురించి కానే కావు. నిజానికి అవి రాత్రి కి రాత్రి బాగా డబ్బు సంపాదించడానికి లాభదాయకమైన కొత్త మార్గంగా మారాయి. మిషనరీ ఉపకరణం,ఈ ఆత్మల పంటకోత యొక్క బహుళస్థాయి మార్కెటింగ్ ఏజెంట్లకు రక్షణ కల్పిస్తుంది, వీరు కొత్త మతాంతరితులను సంపాదించటానికి చాలా అసహ్యమైన వ్యూహాలను వినియోగిస్తారు. మరోపక్క ఈ బెదిరింపును నిరోధించడానికి ప్రయత్నించే వ్యక్తులను, హిందువుల సమూహాలను ఎక్కువగా నిర్వీర్యం చేశారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం చిత్రం రువాండా దేశ సమాజం పూర్తిస్థాయిలో అంతర్యుద్ధం చెలరేగి చివరికి క్రీస్తు కోసం బలి కాబోయే ఆరంభ స్థితిని పోలి ఉంది.

నా ఉద్దేశ్యం యొక్క పూర్తి వివరాలకు, బ్రేకింగ్ ఇండియాలో ని రువాండా మారణహోమం అనే భయానక అధ్యాయం చదవండి. దాన్ని చదివి మననం చేసుకోండి.

అధ్యాయం 4: గాఢ నిద్ర గాయపరుచు కుంటుంది

మూడు బలీయమైన కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతన్న హిందూ దేవతా మూర్తుల విధ్వంసం యొక్క అతి భయానక సంఘటనలను నేను ఉద్దేశపూర్వకంగా తెలపటంలేదు .

మొదటి కారణం: ప్రాథమికంగా, కేవలం విధ్వంస చర్యలే కాదు, ఒక రకంగా చెప్పాలంటే భయానక సంగీత నాటక రూపకాలలోని రోజువారీ ఘట్టాలలాగా, ఇవి హిందూ హింస యొక్క పూర్తిస్థాయి వ్యాప్తిలో కదిలే బొమ్మలే.

రెండవ కారణం: వీడియో ద్వారా వార్తలను తక్షణ మరియు ప్రపంచ వ్యాప్తి చెందుతున్న ఈ యుగంలో అటువంటి జాబితాను అందించడం అనవసరం.

మూడవ కారణం: పెక్కు సంఖ్యలో ఉన్న వెబ్‌సైట్లు మరియు పోర్టల్స్ వాటిని సూక్ష్మంగా రికార్డ్ చేయడం మూలంగా.

Y.S. Rajashekhara Reddy

ఈ హిందూ హింస యొక్క ఉదంతాలు మనం మాటల్లో చెప్పేలోపలే పెరిగిపోతూ ఉంటాయి.

నేను ఈ మాత్రమే చెబుతాను: చరిత్ర పుస్తకాలలో మీరు చదివిన మధ్యయుగ తురుష్క అనాగరికులచే ధ్వంసం చేయబడిన వేలాది దేవాలయాల యొక్క వాస్తవ మరియు ప్రత్యక్ష రుజువు మీరు ఎప్పుడైనా కోరుకుంటే, దయచేసి జగన్ రెడ్డి పాలిత ఆంధ్రాను సందర్శించండి. చరిత్ర యొక్క ఆ బాధాకరమైన కాలంలో కనీసం, మన పూర్వీకులు ఆఖరి వ్యక్తి వరకు మరియు తమ చివరి రక్తం బొట్టు వరకు అసలైన చిత్తశుద్ధితో పోరాడారు. కానీ నేడు వారి వారసులు విలపిస్తూ ఏడుస్తున్నారు.

ప్రోలయ వేమ రెడ్డి ఈ రోజు కనుక బ్రతికి ఉండి ఉంటే ఎలా స్పందిస్తారో అని అనుకుంటున్నాము .

పైన పేర్కొన్న తెలుగు పండితుడు నాతో చెప్పిన మరో కఠోర సత్యం ఇది: హిందూవులు తమ నాశనానికే జగన్ రెడ్డి కి వోటు వేసి గెలిపించుకున్నారు.

నిక్కచ్చిగా వాస్తవం చెప్పాలంటే, అధికసంఖ్యలో హిందూ ఓట్లు లేకుండా ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయేవారు. మరొక వాస్తవం ఏమిటంటే, అతను క్రైస్తవుడిగా కాకుండా చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి పాలన నుండి ఆంధ్రప్రదేశ్ ను విముక్తి చేయడానికి ప్రచారం చేసాడు. అయితే, ముఖ్యమంత్రిగా దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఆయన సాధించిన రికార్డు ఏమిటి? తన తండ్రి పాలనలో కూడా జరగని నిరంతర హిందూ వ్యతిరేక దాడులు రాత్రికి రాత్రి చెలరేగిపోవడం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎలా వచ్చింది ?

జగన్ రెడ్డిని పూర్తిగా నిందించడం కొంతవరకు అన్యాయమే. మనము ఇంకో వైపు కూడా పరిశీలించినప్పుడే ఆంధ్రాలోని పరిస్థితి యొక్క పూర్తి వాస్తవికత రూపరేఖలు స్పష్టమవుతాయి. స్వామి వారు జగన్ కు చక్కటి భారీ వోట్ బ్యాంకును దారబోశారు. అప్పటినుండే ఆ స్వామి వారు శక్తివంతులుగా ప్రకాశించడం మొదలైంది. మునుపటి రాజుల కాలంలోలా కాకుండా, ఈయన లాంటి స్వాములు నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయశక్తి యొక్క స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక మార్పులను అర్థం చేసుకోలేరని స్పష్టమవుతుంది.

తలుచుకుంటే ఇప్పటికే ఇది ఆంధ్రాలో ఒక శోచనీయమైన మరియు బ్రష్టుపట్టిన సనాతన సమాజ స్థితి. కానీ మున్ముందు ఇంతకన్నా ఘోరం గా ఉంటుంది.

కొన్ని నెలల క్రితం ఆంధ్ర నుండి వచ్చిన ఒక వింత పోస్టర్ మరియు ఈమెయిల్ ప్రాచుర్యం సంతరించుకున్నాయి. అది ఒక రకంగా తమ రక్షకుడిగా భావించిన జగన్ రెడ్డికి సంఘీభావం తెలిపే ఆంధ్రప్రదేశ్ వైదిక బ్రాహ్మణ సమాజం ఇచ్చిన ప్రకటన.

బహుశా ఈ విపరీత పరిస్థితిని వివరించడానికి డాక్టర్ ఎస్.ఎల్ భైరప్ప యొక్క మహత్కర రచన అయిన తంతు లో కనిపించే అర్చక రామ భట్ట కథను వివరించడం ఉత్తమమైన మార్గం. దేవాలయాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తరువాత, అలాంటి వేలాది అర్చకుల పరిస్థితి నిజంగా దయనీయం అవుతుంది . ప్రభుత్వం వారికి చిన్న మొత్తాన్ని ఇస్తుంది. అందుకే వారిలో చాలామంది తమ పురాతన ధర్మాన్ని వదిలివేస్తారు. విశిష్ట దేవాలయాలు పనికిరాకుండా పోతాయి మరియు వాటిలోని విగ్రహాలు స్మగ్లర్లు మరియు దొంగలపాలవుతాయి. ఏదేమైనా, రామ భట్ట వంటి ధైర్యవంతులు స్థిరంగా నిలబడి ఉంటారు. ఆయన ప్రభుత్వ జీతం తీసుకోవడానికి నిరాకరించాడు, కానీ పురాతన హొయసల ఆలయానికి వంశపారంపర్యంగా అర్చకకులుగా తన ధర్మ విధులను కొనసాగిస్తున్నాడు. ఆయన ఇలా చెబుతున్నాడు: “గుమస్తాకి లంచం ఇచ్చిన తరువాత ప్రభుత్వం నుండి వచ్చే డబ్బుతో నేను ఆలయంలో దీపం వెలిగించాలా? నేను ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఒక్క నాణెం కూడా తీసుకోలేదు. నేను ఎప్పటికీ తీసుకోను. ప్రఖ్యాత మరియు పెద్ద దేవాలయాల నుండి అర్చకులు సమ్మెకు దిగారు. ప్రభుత్వం నుండి వారి డిమాండ్: మీరు మాకు ఇచ్చే డబ్బు చాలదు.. తాలూకా మరియు మునిసిపల్ కార్యాలయాలలో స్వీపర్ లేదా టాయిలెట్-క్లీనర్‌కు సమానమైన జీతం మీరు మాకు ఇవ్వకపోతే, మేము పూజలు చేయడం మానేస్తాము. ఇంకో మాటలో చెప్పాలంటే, వారు తమ పనిని దేనితో పోలుస్తున్నారు? పూజలు చేయకుండా వారు సమ్మెకు వెళితే, వారికి భక్తి ఉన్నట్లా ? ” దీని గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం.

చివరి మాట

ప్రస్తుతానికి కొంత ఓదార్పు ఏమిటంటే, చిన్న జీయర్ స్వామి, ఇంకా ఇతర హిందూ స్వామీజీలు , పవన్ కళ్యాణ్ మరియు బిజెపి లోని సునీల్ దేయోధర్ వంటి రాజకీయ ప్రముఖులు చివరకు మేల్కొన్నట్లుగా తెలుస్తోంది, ముఖ్యంగా రామ తీర్థం వద్ద జరిగిన వికృత విధ్వంసం తరువాత మనం గౌరవించదగ్గ ఈ మాత్రం స్పందన చాలా ఆలస్యంగా కూడా వచ్చింది మరియు అది చాలా తక్కువ కూడా. మరణానంతర పరీక్షకంటే జాగరూకత కూడిన నివారణ ఎప్పుడూ ఉత్తమమైనది. ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రముఖులందరూ ఒక గట్టి నిరసనను ప్రకటించారు, అది స్వల్పకాలానికి మాత్రమే పనికొస్తుంది, ఎందుకంటే నిజమైన పని వేరే రంగంలో ఉంది.

మొదటి అడుగుగా, సనాతన సమాజంలోని ఈ ఆధ్యాత్మిక మార్గదర్శకులు మిషనరీ మృగం యొక్క వాస్తవ స్వభావాన్ని పట్టుకొని నాగరికతను నాశనం చేసే సిద్ధాంతాన్ని దాని మూలాన్ని అర్ధం చేసుకోవాలి. అప్పటి వరకు, చిన్నమరియు పెద్ద హిందూ సమూహాలు మరియు వర్గాలు అందించే ఉత్సాహపూరిత ప్రతిఘటన మొత్తానికి స్వల్పకాలికంగా ఉంటుంది. ఈ సాధువులు, స్వామీజీలు మరియు రాజకీయ నాయకులు వారికి ఎదురైనా క్రైస్తవ రాజ్యం యొక్క నిరూపితమైన వాస్తవికతను కూడా అధ్యయనం చేయాలి.

ఇదే ఆఖరి అవకాశం.

|| ఓం తత్ సత్ ||

The Dharma Dispatch is now available on Telegram! For original and insightful narratives on Indian Culture and History, subscribe to us on Telegram.