మురికి కూపంలో అరవై వేల సంవత్సరాల క్రిమి గా జీవించడం - ఎన్ని దేవాలయాలు కొల్లగొట్టిన ఫలితమో
Read this article in English
మధ్యయుగాల నాటి (ఆధునిక చరిత్ర ననుసరించి ) ముస్లిముల సుదీర్ఘ దౌష్ట్యపాలనలో హిందువులు అన్నివిధాలుగా అణగద్రొక్క బడ్డారు - భౌతికముగా, మతపరముగా, నైతికముగా, సాంస్కృతికముగా, ఆర్థికముగా తీవ్రమైన హింసకు గురైనారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారమే నడిచింది; ఇస్లాము మతానుగుణంగానే, ఇస్లాము రాజ్యపరిపాలనానుగుణంగానే నడిచింది. ముస్లిం పరిపాలనలోనున్న ముస్లిమేతరులను 'జీమ్మీ' లనీ లేదా 'ధిమ్మీ'లని వ్యవహరించేవారు. జిమ్మీలకు అనగా హిందువులకు ఎటువంటి హక్కులూ లేవు. వారు తమ సిద్ధాంతాలను ప్రచారము చెయ్యరాదు. గుళ్ళు కట్టడము కానీ, గుళ్ళను బాగుచేయించడముగాని చెయ్యరాదు. అధిక పన్నులు విధించి నిలువు దోపిడీ చేసేవారు . వాళ్ళకు జరిగిన అన్యాయాలకు న్యాయవిచారణ లేదు. హిందువుల స్త్రీలను ముస్లిములు ఏమైనా చేయవచ్చును.
దాదాపు ఇటువంటి స్థితిని తలపించే పరిస్థితి యూపీఏ ప్రభుత్వ పాలనలో 2013 లో జరిగినది, అది తరువాత పరిశీలిద్దాము , ప్రస్తుత చరిత్ర చూద్దాము.
హిందువును ఎరజేసే చట్టాలు
స్వతంత్ర భారతంలో దాదాపుఆమోదం పొందినప్రతి శాసనముహిందూ సమాజము బలహీనపడేందుకు దోహదము చేయునట్టిదే . అట్టడుగు వర్గాలకు రిజర్వేషను అనే ఉద్దేశ్యంలో మంచి కనబడుతున్నా, చివరకు వర్ణాలలో ఒత్తిడిలు, చీలికలు తెచ్చి హిందూ సమాజము బలహీనమయ్యేట్లు చేసింది. హిందూ వివాహ చట్టం హిందూ కుటుంబ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసేందుకు పనికివచ్చింది. భూసంస్కరణలని గొప్పగా ఊదరగొట్టిన సంస్కరణలు హిందువులను బీదలను చేసింది, సోమరులను పెంచింది. హిందూ దేవాలయ చట్టం దేవాలయ సంస్కృతిని, విశిష్టతలను క్షీణదశకు తెచ్చింది.
ఇన్ని అవరోధాలను ఎదుర్కొంటున్నా హిందువులు ఏదో విధంగా యుగాల నుంచి వస్తున్న సనాతన సాంస్కృతిక ఐక్యతను వీలున్నంతలో రక్షించుకొని ముందడుగు వేస్తున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే , ఈ సాంస్కృతిక ఐక్యత, బాంధవ్యాలు ఎన్నో నిరంతర దాడులను ఎదుర్కొనవలసిన పరిస్థితి నేడు నెలకొన్నది. మరో విచిత్రమైన విషయం, ఈ దాడులు ఏ ముస్లిం లేదా వలస ఆక్రమణదారుల వలన కాదు, కేవలం స్వయంగా హిందువుల వల్లనే. కేవలం 1947 నుండి దేశ పాలన చేపట్టిన కాంగ్రెస్ వంశ పాలనలోనే.
అలాంటి ఒక దాడి 2013 లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ దేశము లోనిపెద్ద దేవాలయాలు- అనగా తిరుపతి , షిర్డి ,సిద్ధివినాయక ఆలయం , పద్మనాభ స్వామి ఆలయం వంటి ఆలయాల్లోఉన్న బంగారం ప్రభుత్వాధీనం చేయాలని ఒక ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ఈ వార్త బయటకు రాగానేదేశావ్యాప్తంగా అలజడులు, నిరసనలు వెల్లువెత్తాయి , దాంతో వాళ్ళు వెనక్కు తగ్గారు. కాని హిందువులు తమ ఉనికికేప్రమాదమైన విధముగా తమ వ్యవస్థలపై ఆధిపత్యాన్ని వదులుకున్న తీరు ఎంతో బాధాకరం. శబరిమల గురించి ఆలోచించండి. అక్కడజరిగిన సంఘటనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన దారుణమైన తీర్పును కూడాపరిశీలించండి.
ఆలయాల బంగారాన్ని స్వాధీనం చేసుకోవాలనే దుర్మార్గపు ఆలోచనలకు మూలాలు ఎక్కడ ఉన్నాయి ఆరా తీస్తే, మరెక్కడో కాదు రిజర్వ్ బ్యాంక్ సలహాదారుడు జమాల్ మెక్ లాయ్ అనే మహానుభావుడి మెదడులోంచి ఊడిపడ్డ ఆలోచనా శకలమే అది. అతడు ఇలా అన్నాడు:
విత్తమంత్రి, రిజర్వు బ్యాంక్ తిరుమల తిరుపతి దేవస్థానముల ట్రస్టీలతో వెంటనే సంప్రదించాలి. వీరిలో ముగ్గురు ప్రభుత్వము వారిచే నియమించబడిన వాళ్ళు కనుక , ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో అది ఒక అనుకూల విషయం.
తిన్నగా చెప్పాలంటే , కాంగ్రెస్ పార్టీ హిందువులను , వారి ధార్మిక సంస్థలను, నమ్మకాలను దెబ్బతీయడంలో చరిత్రగల పార్టీ. కాబట్టి జమాల్ మెక్ లాయ్ మరోసారి అలాగే చేసినా పెద్ద తేడా రాదని వాదించాడు.
హిందువులు, దేశ ప్రజలుగా , సంఘటిత సమాజముగా, జమాల్ మెక్ లాయ్ వాదనను దృష్టిలో ఉంచుకొని తమ పవిత్ర సనాతన సంస్థలు , దేవాలయాలను, ఏ ఇతరుల జోక్యం లేకుండా సత్వరమే విముక్తి కలిగించవలసిన ఆవశ్యకత ఉన్నది.
జమాల్ అనే ఈ ముస్లిం వ్యక్తి ఇదే విధంగా మసీదులనుండి , చర్చిలనుండి సేకరణకు సలహా ఎందుకివ్వలేదో, ఆశ్చర్యం. చర్చిలు , వక్ఫ్ బోర్డులు విస్తారమైనభూసంపదకలిగిఉన్నారు. వరుసగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు అబ్రహాము మూలమైన మతాలకు ఇచ్చిన ప్రోత్సాహం వలన వాళ్ళ ఆస్తులు విచ్చలవిడిగా, ఎంతగా పెరిగిపోయాయిఅంటే , వాటితో ఆఫ్రికాలో కొన్ని దేశాలే కొనొచ్చును. 2012 లో మద్రాసు హైకోర్టు రూలింగు నుంచి ఈ మచ్చుతునక చూడండి.
చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (CSI-TA) అనే కంపెనీ, కంపెనీల చట్టము క్రింద నమోదు కాబడిన సంస్థ. అందుచేత కంపెనీల రిజిస్ట్రార్ వారు సెక్షన్ 209 ఏ క్రింద వారి ఆస్తుల దస్తవేజులను పరీక్షించుటకు అధికారికముగా హక్కును కలిగిఉన్నారు. దక్షిణ భారతదేశములోని నాలుగు రాష్ట్రాలలో చర్చ్ ఆస్తులు లక్షకోట్ల రూపాయలవరకు ఉండవచ్చునని , వాటివలన ఆదాయం వెయ్యి కోట్లవరకు ఉండవచ్చునని తెలుస్తున్నది
ఇంతటి విలువైన ఆస్తులు ఉన్న చర్చ్ తలచుకుంటే లక్షలమంది ఏం . కె . స్టాలిన్ లను లొంగదీసుకోగలదు. అదే కోవలోకి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై . ఎస్ ,. జగన్మోహన రెడ్డి , అతడి మతమార్పిడుల బావమరిది 'బ్రదర్ . అనిల్ కూడా చెందుతారు.
హిందువుల విషయానికి వస్తే అన్ని రకాల కుయుక్తులు అక్కరకు వస్తాయి. బంగారం ఊరికే ఉంటుంది తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. మనుషులు కష్టపడి పనిచేసి మాత్రమే సంపదలను కూడబెట్టగలరు. విద్యార్థులు చదువుకోవడం ద్వారా, బుద్ధిని పెంచుకోవడం ద్వారా సంపదలను పెంచుతారు. ఇటువంటి యుక్తి ద్వారా పద్మనాభ స్వామి ఆలయ ట్రస్టీలు వారి వద్దనున్న బంగారం నిల్వలను ద్రవ్య నిర్వహణకు వినియోగించేందుకు సహకరించాలి. వినడానికి ఈ ప్రతిపాదనలు సబబే అని అనిపించవచ్చు. అయితే ఇందులో రెండు ముఖ్యమైన విషయాలను పరిగణన లోకి తీసుకోలేదు వాళ్ళు - చారిత్రకంగా, సాంస్కృతికముగా దేవాలయానికి బంగారము , ఆస్తులు ఉండడములోని ప్రాధాన్యత ఏమిటి , రెండవది గత డెబ్బది సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పాల్పడుతున్న దోపిడీ విధానం వాదనలు ఎన్నయినా చేయవచ్చు, వాటి కి కొదవే లేదు. అయితే అవన్నీ ఒకే పార్శ్వం చూపేవి మాత్రమే. అందుచేత వారి గత చరిత్రను బట్టి , నిజాయితీ లేని వ్యక్తులు ఒక పథకం ప్రకారమే ఈ విధముగా అడుగులు వేస్తున్నారని నమ్మవచ్చు.
హిందూ దేవాలయ యాజమాన్యం
చారిత్రకంగా చూసినట్లయితే దేవాలయాల నిర్మాణం రాజుల చేతనో, సంఘాలు , కుల సంఘాల చేతనో , వ్యక్తులచేతనో నిర్మింపబడేవి. రాజులు నిర్మించిన గుడులు స్వయంగా ఆయా రాజుల ద్వారాగాని , వారు ఏర్పాటుచేసిన ప్రజలచేతనో లేదా ఒక పరిషత్తు చేతనో రోజువారీ నిర్వహణ జరుపబడేది. అంతకు ముందే యున్నఆలయాలకు అప్పటికే ఉన్న యాజమాన్యము చేతనే నడిపించడం గాని , లేదా నిర్వహణ ఇబ్బందులను గమనించి రాజులు అదనంగా భూములు ఇవ్వడంగాని , భూరి విరాళాలను ఇవ్వడము గాని చేసేవారు. దాదాపు అతి ప్రాచీనమైన ప్రతి దేవాలయానికి , అంత ప్రాచీనము కాని దేవాలయానికి కూడా దేవాలయ కర్తృత్వ , నిర్వహణ బాధ్యతలకు సంబంధించి శిలాశాసనాలు ఉంటూ ఉండేవి.
కొందరు వ్యక్తులు నిర్మించిన ఆలయాలకు నిర్వహణ బాధ్యతలను, ఆ ప్రాంతపు ప్రజలు అనగా , స్థానికులే నిర్వహించేవారు. ఇది నేటి కాలపు దేవాలయాల ధర్మకర్తల మండలి లాంటిది. స్థానికులలో నాలుగు వర్ణాల వారు నిర్వాహక సభ్యులుగా ఉండేవారు. పెద్దవైనా, చిన్నవైనా, నిర్ణయాలు సామూహికముగా తీసుకొనబడేవి.
దేవాలయ యాజమాన్యం రెండు వర్గాలుగా విభజింపబడి ఉండేది.
అర్చక వర్గము - పూజలు , పూజకు అనుబంధిత ఆగమ ప్రక్రియలు జరిపేవారు
పరిచారక వర్గము - దేవాలయ ప్రాంగణము శుభ్రం చేసే సిబ్బంది, అవసరమైన వస్తుసంభారమును అందజేయుట, ఆలయ నిర్వహణ మొదలయిన ఇతర కార్యములు చేసేవారు.
పై ఇరు వర్గాల చర్యలు 'స్థానికు'ల పర్యవేక్షణలో ఉండేవి. దుష్కృతములకు తగిన శిక్షలు ఉండేవి. అర్చక వర్గానికి కొంత 'జీతము' ధనరూపేణ , కొంత వస్తురూపేణ ఇవ్వబడుతుండేది. పరిచారక వర్గానికి సాగు చేసుకొనే భూమి, బట్టలు , ధాన్యము, దేవాలయానికి వచ్చిన విరాళాలలో కొంత భాగము ' అదనము ' గా డబ్బురూపకము ఇవ్వబడేది.
ఒక దేవాలయము అనగానే, భగవంతుని ఆరాధనా స్థలము మాత్రమే కాదు, అది ప్రజల జీవనయానములో అల్లుకుపోయిన విశిష్టమైన ఆర్థిక విధానము. ప్రతి ఆలయానికి నిత్య పూజలు మాత్రమే కాక, దేవాలయానికి ప్రత్యేకతను సంతరించి పెట్టే విశిష్ట పూజలు కూడా జరుపబడతాయి. అటువంటి పూజలకు ఆగమశాస్త్రానుగుణముగా ద్రవ్యములనుకూడా వాడవలసి ఉంటుంది. ఉదాహరణకు నిర్దిష్ట పరిమాణములో పాలు , చక్కెర, బెల్లము , కర్పూరము , పరిమళ ద్రవ్యాలు , పూలు, నైవేద్యములు మొదలయినవి. గుడిని రంగవల్లులతో అలంకరించవలసి ఉంటుంది. అదే విధముగా యజ్ఞ యాగాదులకు కూడా ద్రవ్యములు సమకూర్చవలసి ఉంటుంది. ఈ సంప్రదాయ విధానం వివిధ వృత్తులలో, వ్యాపారాలలో, నైపుణ్యముగల వందలాది ప్రజలకు జీవనోపాధికల్పించుతున్నది. నేటికీ ఆలయాల ఆధారముగా జాతరలు కొలుపులు దాదాపు అన్ని గ్రామాల్లో దేశవ్యాప్తముగా జరుగుతూ ఉంటాయి. ఈ విస్తారమైన ఆలయ ఆధారిత వ్యవస్థ సమాజ ఆర్థిక వ్యవస్థకు జీవగఱ్ఱగా నిలబడింది.
ఈ ఆలయ వ్యవస్థను మనం మరో రెండు విభాగాలుగా కూడా చూడవచ్చు.
గ్రామాశ్రిత ఆలయాలు : ఇక్కడ ఆ గ్రామమో , పట్టణమో ఆ ఆలయాన్నిఆదరించి నిర్వహించి, పరిరక్షించే బాధ్యతలను స్వీకరిస్తుంది.
ఆలయాశ్రిత గ్రామాలు :ఇక్కడ ఆ గ్రామమో , పట్టణమో ఆ ఆలయం ఆధారంగా జీవనాన్ని కొనసాగిస్తుంది. దీనికి ఉదాహరణగా దక్షిణ భారతములో ఇటువంటి గ్రామాలు పట్టణాలు ఎన్నింటినో చూడవచ్చు.
దేవాలయ సంపద - యాజమాన్య పద్ధతి
హిందూ దేవాలయ ఆస్తులను రెండు విభాగాలు చేయడం జరిగింది. 1 స్థిరాస్తులు 2. దేవస్వము . దేవాలయ భూములు , గుడి కట్టడము, అనుబంధ కట్టడములు, కల్యాణ మండపాలు , నీటి చెరువులు, అతిథి గృహాలు మొదలయినవన్నీ స్థిరాస్తులే.
దేవస్వము అనగా దేవునికి చెందినవి అని అర్థం. మనము మొదలుపెట్టిన సందర్భము దీనికి సంబంధించినదే. దేవునికి భక్తులు సమర్పించిన ఆభరణాలు , బంగారము,వెండి, వజ్రాలు, రత్న మాణిక్యాల వంటి జాతి రాళ్ళు మొదలైనవన్నీ దేవస్వము లో భాగమే. దానధర్మానికి కట్టుబడి భక్తులు చేసినవి. కోట్లాది హిందువులు ఈ విధముగా దేవునికి సమర్పణలు చేసి దానధర్మాన్ని తెలియకుండానే అనుసరిస్తున్నారు.
ఒకసారి భగవంతునికి సమర్పణ జరిగిన తరువాత దాన్ని మార్చడానికి , ఏ కారణము చేతనయినా అమ్మడానికి ఎవరికీ ఎటువంటి హక్కులూ లేవు. ఆ దేవాలయ యాజమాన్యానికి కూడా ముట్టుకొనే హక్కులేదు. అంతేకాదు, రాజు గాని లేదా ప్రభుత్వము గాని అవసరమైతే సాయుధదళాలను ఉపయోగించైనా ఆ ఆస్తులను రక్షించడం కర్తవ్యము, బాధ్యత కూడా .
శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో అనూచానంగా వస్తున్న ఒక ఆచారము అమలులో ఉన్నది. ఆలయం హుండీ లో వేసిన ముడుపులన్నీ స్వామివారికే చెందుతాయి, సమర్పించిన వారికి కూడా ఎటువంటి హక్కులు లేవు. ఆలయంలో స్వామి ప్రతినిధి 'కొలువు శ్రీనివాసుడు' ఉంటాడు. రాత్రి గుడిని మూసే ముందు అర్చక స్వాములు, అధికారులు ఆరోజు హుండీ లో వసూలయిన మొత్తము లెక్క ఆ స్వామి వారికి నివేదిస్తారు. ఇన్ని శతాబ్దాలు గడిచినా ఈ ఆచారము నిరాఘాటముగా సాగుతూనే ఉన్నది.
ఇలాంటిదే మరొక ఉదాహరణ కాశీ నుంచి. కాశీ లో కాలభైరవుడిని 'కొత్వాల్ కాలభైరవ' అంటారు. ఆయన కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. క్షేత్రపాలకుని యొక్క రూపాంతరమే 'కొత్వాల్ ' అనగా రక్షకుడు లేదా పోలీసు. కాబట్టి ఇటువంటి కర్మకాండలు నిర్వహించడంలోని అంతరార్థమేమిటో మీ ఊహాలకే వదిలిపెడుతున్నాను. కనుక మనకు సంక్రమించిన ఇటువంటి వారసత్వసంపద కనుమరుగైతే , తిరిగి దానితో సమమైనదేదీ మనము తెచ్చి భర్తీ చేయలేమని మరువరాదు.
అసలైన లూటీ
హిందూ దేవాలయాలలో భక్తులు సమర్పించిన బంగారము , ఆభరణాలు మొదలైన ముడుపులన్నిటికీ ఆ యాజమాన్యాలు రక్షకులు మాత్రమే. కాని స్వంతదారులు కాదు, అందుచేత వారికి ఆ ఆభరణాల మార్పిడిచేయుటకు గాని , విక్రయించుటకు గాని ఎటువంటి హక్కులు లేవు. మౌళికముగా దేవాలయ యాజమాన్యాలు భక్తుల తరఫున దేవాలయ ఆస్తుల పరిరక్షకులు,ధర్మకర్తలు. బహిరంగముగా కనబడి, భగవంతుని కి చేసిన సమర్పణ భక్తుల ఆంతరంగిక భక్తికి ప్రతీకగా మనం గుర్తించాలి.
ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి - మీరు చదివిన పుస్తకాలు , కథలు, వ్యాసాలు. మీరు చూసిన నాటకాలు, సినిమాలు - అన్నింటిలో సామాన్యం గా ఒక దృశ్యం - గుడిలో పూజారులను కించపరచడం, అవమానించడం , హేళన చేయడం - గుడికి వెళ్ళడం ఒక 'టైమ్ వేస్ట్' అని కొట్టిపారేయడం - గమనించారుగదా! అలాగే దీన్ని కూడా చూడండి,- 'షోలే ' లో మసీదునుంచి ఎంతో పవిత్రంగా వస్తున్న ఏ కె హంగల్ , అమర్ -అక్బర్ - ఆంథోనీ లో దయార్ద్ర హృదయుడైన 'ఫాదర్' లతో పై సన్నివేశాలను పోల్చి చూడండి. ఆలోచించండి
కాబట్టి 2013 లో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టినది ప్రపంచ వ్యాప్త హిందువులమనోభావాలమీద , వారి భక్తి ప్రపత్తుల మీద దాడి కాక మరొకటి కాదు.
తిరుమల దేవాలయ ధర్మకర్తలు వందల సంవత్సరాలుగా భక్తులు సమర్పించిన బంగారము, ఆభరణాలను భద్రంగా రక్షిస్తూ వస్తున్నారు. చిన్న రాజ్యాల రాజులు కావచ్చు , పెద్ద రాజ్యాల రాజులు కావచ్చు - వారందరూ భాగవత్సేవలో ఆలయాలకు సమర్పణలు చేసినవారే - వారి దృష్టిలో రాజ్యము, సంపద వారి భక్తి ప్రపత్తులకన్నా ఎక్కువైనవి కావు. ఈ నేపథ్యంలో భక్తితో ప్రజలు, రాజులు చేసిన సమర్పణలను గుంజుకోవాలనుకోవడం గతించిన భక్తుల అభీష్టాల పట్ల చేయదలచిన మహాపరాధం . మహా దౌష్ట్యం. ఇది మహా చౌర్యం.
హిందూ దేవాలయాల బంగారం మీద కన్ను వేసిన కాంగ్రెస్ ప్రభుత్వపు దుర్మార్గానికి గూఢమైన అర్థాలున్నాయి. ఒక్క దెబ్బతో రెండు పిట్టల చందము గా - దేవాలయాల సొమ్ము స్వాధీనం చేసుకుంటే , రాబోయే రోజుల్లో హిందువులు దేవాలయాలకు ధన కనకాలను దానం చేయడం మానేస్తారు. దాంతో దేవాలయ సంస్కృతి సమూలంగా నిర్మూలించబడుతుంది.
లౌకికవాదాన్ని పెంచి పోషించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే. కాబట్టి అడగవలసిన ప్రశ్న - లౌకికవాద కాంగ్రెస్ ప్రభుత్వానికి హిందూ దేవాలయాలలో జోక్యం చేసుకోవడానికి లేని నైతిక హక్కును ఎవరిచ్చారు ? ఒకవేళ ఉందనుకుంటే ఇతర మతాలలో జోక్యం కలగజేసుకోక పోవడానికి కారణం ఏమిటి ? ఈ రెండు ప్రశ్నలు ఎంతోకాలముగా అడగబడుతున్నవే - ఇప్పుడు స్పష్ట పరచవలసిన అవసరం ఉన్నది.
రెండు హెచ్చరికలు
ఏ ప్రభుత్వానికైనా అటువంటి దుస్సాహసాలు చేయబోయేముందు ఈ రెండు సంఘటనలను ప్రమాదఘంటికలుగా గుర్తించాలి .
మొదటిది చరిత్రలోది - 11 వ శతాబ్దములో కాశ్మీరును పాలించిన శ్రీ హర్షుడు హర్షుడు 22 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఆయన దేవాలయాల సొమ్ము కాజేయడంలో దిట్ట. ఆయనలో మార్పు వస్తుందేమో అని వేచి చూసిన కాశ్మీరు ప్రజలు సహనాన్ని కోల్పోయి ఆ రాజును చితకబాది చంపేశారు. ఈ కథనాన్ని కల్హణుని రాజతరంగిణి - ఏడవ తరంగంలో చూడవచ్చు.
రెండవది దానాలకు సంబంధించి దేవాలయ శాసనాలలో ఉండే శ్లోకం:
స్వదత్తాం పరాదత్తాం వా యో హరేత వసుంధరా
ష ష్టి సహస్ర వర్షాని విష్టాజ్జాయతే క్రిమిః ||
ఎవరైతే దానముగా ఇచ్చినదాన్ని , తానిచ్చినదైనా , పరులు ఇచ్చినదైనా, అపహరిస్తారో 60000 వేల సంవత్సరాలపాటు క్రిమి జన్మ మెత్తి మురికి కూపములో పడి ఉంటారు.
మలి వ్రాత
ఎస్ ఎల్ భైరప్ప గారి విశిష్ట రచన - ‘తంతు' లో సంభాషణ గుర్తు చేసి,నేను సెలవు తీసుకుంటాను. ఒక వృద్ధ పురోహితుడు , ఇందిరాగాంధీ చేసిన భూపరిమితుల చట్టాన్ని గురించిమాట్లాడుతూకథానాయకుడితో ఇలా అంటాడు:
నాకు గుర్తున్నంతవరకు ఏ రాజుగాని , సేనాపతిగాని, కనీసం మనల్ని పాలించిన ఆంగ్లేయులుగాని ఈనాము గా ఇచ్చిన భూములను ఆక్రమించడం , స్వాధీనం చేసుకోవడం జరగలేదు. దురదృష్టం , మనవాళ్లే , ఇతరులు దానముగా ఇచ్చిన భూములను దౌర్జన్యంగా లాక్కుంటున్నారు.
The Dharma Dispatch is now available on Telegram! For original and insightful narratives on Indian Culture and History, subscribe to us on Telegram.